ఇన్స్టలేషన్
React ను దశలవారీగా ఉపయోగించడానికి రూపొందించారు. మీ అవసరానికి అనుగుణంగా React ను కొంచెం లేదా ఎక్కువగా ఉపయోగించవచ్చు. React అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, HTML పేజీకి ఇన్‌టరాక్టివిటీ జోడించాలనుకుంటున్నారా, లేదా ఒక పెద్ద React యాప్‌ను రూపొందించాలనుకుంటున్నారా? అయితే, ఈ విభాగం మీకు సహాయపడుతుంది.
In this chapter
React ను ట్రై చేయండి
React తో పని చేయడానికి మీరు ఏమీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాండ్‌బాక్స్‌ను ఎడిట్ చేసి చూడండి!
function Greeting({ name }) { return <h1>హలో, {name}</h1>; } export default function App() { return <Greeting name="వరల్డ్" /> }
మీరు దీన్ని డైరెక్ట్ గా ఎడిట్ చేయవచ్చు లేదా కుడి పైభాగంలో ఉన్న “Fork” బటన్‌ని నొక్కి కొత్త టాబ్‌లో తెరవచ్చు.
React డాక్యుమెంటేషన్‌లోని చాలా పేజీలు ఇలాంటి సాండ్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. React డాక్యుమెంటేషన్ బయట కూడా React ను సపోర్ట్ చేసే అనేక ఆన్‌లైన్ సాండ్‌బాక్స్‌లు ఉన్నాయి: ఉదాహరణకు, CodeSandbox, StackBlitz, లేదా CodePen.
మీ సిస్టమ్‌లో React ను ప్రయత్నించండి
మీ కంప్యూటర్‌లో React ను ప్రయత్నించాలంటే, ఈ HTML పేజీని డౌన్లోడ్ చేయండి. దీన్ని మీ ఎడిటర్‌లో మరియు బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి!
కొత్త React ప్రాజెక్ట్ ప్రారంభించండి
React తో పూర్తి స్థాయిలో ఒక యాప్ లేదా వెబ్‌సైట్ నిర్మించాలనుకుంటే, కొత్త React ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి.
ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి
మీ ప్రస్తుత యాప్ లేదా వెబ్‌సైట్‌లో React ను ఉపయోగించాలనుకుంటే, ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి.
తదుపరి చర్యలు
React లో మీరు ప్రతిరోజూ ఎదుర్కొనే ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను పరిచయం చేయడానికి క్విక్ స్టార్ట్ గైడ్‌ను సందర్శించండి.